Corn Crop | బోనకల్ : మండల పరిధిలోని ఆళ్ళపాడు గ్రామంలో సాగు నీటి ఎద్దడితో వడలిపోతున్న మొక్కజొన్న పైర్లను జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆళ్ళపాడు గ్రామంలోని మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులతో ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రస్తుతం సాగర్ కెనాల్ కింద మొక్కజొన్న ఫైర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆలస్యంగా సాగుచేసిన మొక్కజొన్న పంటకు త్వరగా నీరు విడుదల చేసినట్లయితే పంటలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని వారికి తెలిపారు. వారబంధి విధానంలో నీటిని విడుదల చేస్తూ ఒకటి లేదా రెండు రోజులు అదనంగా నీరు ఇస్తే బాగుంటుంది అని కోరారు.
జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. రాబోయే 3 లేదా 4 రోజుల్లో నీటిని విడుదల చేస్తారని, ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారని తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా పంట వడలినట్లు అనిపిస్తే 2% యూరియా ద్రావణాన్ని పిచికారి చేసుకోమని తెలిపారు. ఎరువుల వినియోగంలో యూరియా అవసరం మేరకు, సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు.
మన భూముల్లో అధికంగా బాస్వర నిల్వలు ఉన్నాయని, కావున పైపాటుగా మాత్రమే కాంప్లెక్స్ ఎరువులు వినియోగించాలి అని సూచించారు.ఈ కార్య్రమంలో మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు స్వర్ణ విజయ చంద్ర, వ్యవసాయ అధికారి పసునూరి వినయ్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి బంధం రజిత, అత్మ కమిటీ డైరెక్టర్ కందుల పాపారావు, షేక్ దస్తగిరి రైతులు పాల్గొన్నారు.
Government Hospital | రికార్డ్ బ్రేక్.. 5 రోజుల్లో 200 సర్జరీలు