బోనకల్లు, మే 27 : పలు అనారోగ్య సమస్యలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సిఫార్సు మేరకు మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు టెలీ కమ్యూనికేషన్ సభ్యుడు ఉమ్మనేని కృష్ణ, డాక్టర్.కోట రాంబాబు మంగళవారం పంపిణీ చేశారు. బోనకల్లు మండలం తూటికుంట్ల గ్రామంలో వివిధ గ్రామాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు రూ.11 లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ తుళ్లూరి లక్ష్మీనారాయణ, నల్లమోతు సత్యనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనుమోలు వెంకటేశ్వరరావు, కన్నేటి సురేశ్, గొడుగు కృష్ణ, బోయినపల్లి మురళి, సాదినేని రాంబాబు, బండి వెంకటేశ్వర్లు, చండ్ర వెంకట్రావు, నర్సయ్య శాస్త్రి, చిగులుపాటి కృష్ణ, గాలి కృష్ణ, తుళ్లూరి రామయ్య, కమతం లక్ష్మయ్య, తుళ్లూరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.