కారేపల్లి, నవంబర్ 10 : మత్స్యశాఖ ఆధ్వర్యంలో సింగరేణి మండలంలోని చెరువులకు సోమవారం చేప పిల్లలను పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా 40 చెరువులకు కలిపి 20 మత్స్య సొసైటీలు ఉండగా మొదటి విడతగా 16 సొసైటీలకు 7,56,378 చేప పిల్లలను అందజేసినట్లు మత్స్యశాఖ అసిస్టెంట్ అధికారి డి.సరిత తెలిపారు. రవ్వ, బొచ్చ, బంగారు తీగ రకం చేప పిల్లలను మత్స్య కమిటీలకు అందజేసినట్లు వెల్లడించారు. మిగతా నాలుగు సొసైటీలకు మరికొద్ది రోజుల్లో చేప పిల్లలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది భాను ప్రసాద్, లక్ష్మణరావు, నవీన్ కుమార్ పాల్గొన్నారు.