బోనకల్లు, ఆగస్టు 11 : బోనకల్లు మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో సోమవారం మండల అధికారులు నులి పురుగుల నివారణకు ఆల్బండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ.. గవర్నమెంట్, ప్రైవేట్ స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్, జూనియర్ కాలేజీ నందు ఆల్బండజోల్ మాత్రలు వేయటం జరిగిందన్నారు. 6,208 మంది పిల్లలకు గాను 5,866 మందికి ఈ మాత్రలను వేసినట్లు చెప్పారు. మిగిలిన వారికి ఈ నెల 18న ఈ టాబ్లెట్లు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమాదేవి, ఎంఈఓ దామాల పుల్లయ్య, ఎస్ఓ సక్కుబాయి, హెల్త్ సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.