ఖమ్మం రూరల్, నవంబర్ 26 : ఖమ్మం రూరల్ మండలంలోని కస్నాతండా గ్రామంలో 1,200 ఓట్లుకు ఎనిమిది వార్డులు ఉన్నవని, 8 వార్డుల్లో 4 జనరల్‌కు, మరో 4 వార్డులు ఎస్టీలకు కేటాయించడం జరిగిందని సీపీఎం పాలేరు డివిజన్ నాయకుడు భూక్య నాగేశ్వరరావు తెలిపారు. అయితే గ్రామంలో సుమారు 400 మంది బీసీ ఓటర్లు ఉన్నారని, 400 మంది బీసీలు ఉన్నా కనీసం జనాభా ప్రాతిపదికన రెండు వార్డులు కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు పున:పరిశీలన చేసి బీసీలకు జనాభా ప్రాతిపదికన వార్డులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీలందరినీ ఐక్యం చేసి మండల పరిషత్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు ఊరుబండి చంద్రయ్య, అవిరేణి నాగరాజు, నాగుబండి రవి పాల్గొన్నారు.