కారేపల్లి, నవంబర్ 04 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల భవిత కేంద్రం నందు సమగ్ర శిక్షా అభియాన్, మండల విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల విద్యా వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముగింపు సభకు మండల విద్యాశాఖ అధికారి డి.జయరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగ చిన్నారుల్లో వైకల్యం అనేది వారి శరీరానికే గాని మనసుకు కాదన్నారు. వారి నైపుణ్యానికి అనుగుణంగా తర్ఫీదు ఇవ్వడానికే భవిత కేంద్రాలు ఉన్నవని, వీటిని తల్లిదండ్రులు సక్రమంగా ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అదేవిధంగా సమగ్ర శిక్షావారు ఉచిత ఉపకరణాలు, ఉచిత ఆపరేషన్స్, అలోవెన్సెస్ అన్ని ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఫిజియోథెరపీ సేవలు కూడా ఇవ్వడం జరుగుతుందని కాబట్టి భవిత కేంద్రం నందు ఐఈఆర్పీ సేవలను వినియోగించుకోవాలన్నారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎంఈఓ బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫిజియోతెరపిస్ట్ రూతమ్మ, ఐఈఆర్పీ వెంకటలక్ష్మి, కృష్ణయ్య, అశోక్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Karepally : అంగవైకల్యం శరీరానికే మనసుకు కాదు : సింగరేణి ఎంఈఓ జయరాజు