తిరుమలాయపాలెం, జూన్ 23 : అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అక్రమాలు జరిగాయంటూ గ్రామ నిరుపేదలు స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఇందిరమ్మ కమిటీ నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయకుండా, అనర్హులకు మంజూరు చేశారని ఆరోపించారు. ఇందిరమ్మ కమిటీని రద్దుచేసి, అర్హులైన ప్రతి పేదకి ఇల్లు మంజూరు చేయాలని ఎంపీడీఓ సిలార్ సాహెబ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ స్పందిస్తూ పిండిప్రోలుకు మరో 40 ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు ధర్నాను విరమించారు.
Tirumalayapalem : అనర్హులకు ఇండ్ల కేటాయింపుపై తిరుమలాయపాలెంలో ధర్నా