మామిళ్లగూడెం, నవంబర్ 24: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందని, ఇందులో ఎంట్రీ చాలా కీలకమైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని సూచించారు. జార్ఖండ్ నుంచి కలెక్టర్లతో ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు.
పట్టణాల్లో డోర్ లాక్ ఉండడం, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు వచ్చాయని అన్నారు. అలాంటి వారికి ఫోన్ చేసి అందుబాటులో ఉండమని కోరి సర్వే చేసుకోవాలని ఆదేశించారు. ఖమ్మం నుంచి కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ మాట్లాడుతూ.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఖమ్మంలో 59.50 శాతం, పాలేరులో 93.64 శాతం, మధిరలో 94.41 శాతం, వైరాలో 96.98 శాతం, సత్తుపల్లిలో 98.09 శాతం చొప్పున జిల్లా వ్యాప్తంగా 84.23 శాతం సర్వేను పూర్తి చేశామని వివరించారు. పక్కాగా డేటా ఎంట్రీ నమోదు చేస్తున్నామని తెలిపారు.