ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 13: విద్యార్థులు పాఠంలోని అంశాలను సమగ్రంగా చదవాలని డీఈవో సోమశేఖరశర్మ సూచించారు. కఠినంగా అనిపించిన వాటిని పలుమార్లు సాధన చేస్తే సులువుగా ఉంటాయని అన్నారు. ఖమ్మంలోని రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తరగతి గదులను పరిశీలించారు. 9వ తరగతిలోని పలువురు విద్యార్థులతో పాఠాలు చదివించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. హెచ్ఎం శాంత, ఉపాధ్యాయులు రజబ్అలీ, కట్టా శేఖర్‌రావు, రాయల మాధవి తదితరులు పాల్గొన్నారు.