వీవోఏల ధర్నాలు, నిరసనలు
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని, తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐకేపీ జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం, కూసుమంచి, వేంసూరు, వైరా, అశ్వారావుపేట, దమ్మపేట, ఇల్లెందు, కరకగూడెం, మణుగూరు మండలాల్లో వీవోఏలు శుక్రవారం ఐకేపీ, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనలు చేపట్టారు.
- తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగిన నిరవధిక సమ్మె
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 22 : అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని, తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐకేపీ జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం, కూసుమంచి, వేంసూరు, వైరా, అశ్వారావుపేట, దమ్మపేట, ఇల్లెందు, కరకగూడెం, మణుగూరు మండలాల్లో వీవోఏలు శుక్రవారం ఐకేపీ, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనలు చేపట్టారు.
నిరవధిక సమ్మెలో భాగంగా పలువురు వీవోఏలు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 363/2025, జీవో 302/2022 ప్రకారం పలు అంశాలను ఇంకా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీవోఏలకు తగిన వేతనాలతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలకు రూ.26 వేల వేతనం చెల్లించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వీవోఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలని, రూ.20 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, ట్యాబ్లు అందజేయాలని కోరారు. లేదంటే ఐకేపీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మణుగూరు టౌన్ : సమ్మెలో పాల్గొన్న ఐకేపీ వీవోఏలు

కూసుమంచిలో సమ్మెలో పాల్గొన్న వీవోఏలు

వైరాటౌన్ : సమ్మె చేస్తున్న వీవోఏలు

ఇల్లెందు : నిరసన తెలుపుతున్న వీవోఏలు
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DGP CV Anand | యూనిఫామ్లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

