చండ్రుగొండ, మే 15 : అన్ని అర్హతలున్నా తనకు ఇందిరమ్మ ఇల్లు రాకుండా చేశారని, నిరుపేదనైన తనకు ఇల్లు ఇప్పించాలని ఓ మహిళ కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌కు గురువారం తన గోడు విన్నవించుకుంది. చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి వెళ్లిన కలెక్టర్‌కు.. అదే గ్రామానికి చెందిన నిరుపేద మహిళ మద్దిరాజు కళమ్మ తాను దరఖాస్తు చేసుకున్నా ఇందిరమ్మ ఇల్లు రాలేదని, మా గ్రామంలో అర్హులకు కాకుండా అనర్హులకు ఇండ్లు మంజూరు చేశారని వాపోయింది.
అన్ని అర్హతలున్నా తనకు ఇల్లు మంజూరు చేయలేదని, వ్యవసాయ భూములు, భవనాలు ఉన్న వారికి ఇండ్లు ఎలా మంజూరు చేశారో అర్థం కావడం లేదన్నారు. ఈ క్రమంలో ఆమెకు సర్ది చెప్పేందుకు అక్కడకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్.. ఆమెను సముదాయించి, రెండో జాబితాలో అర్హులైన వారికి ఇండ్లు వచ్చేలా చూస్తామని చెప్పారు.