ఖమ్మం: బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సమ్మె బాట పట్టిన కమర్షియల్ బ్యాకు ఉద్యోగులకు డీసీసీబీ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. గురువారం డీసీసీబీ ప్రధాన కార్యాయం ఆవరణలో మధ్యాహ్నభోజనం సమయంలో ఆయా యూనియన్ల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కమర్షియల్ బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని వారు నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ వీరబాబుతో పాటు పలు హాదాల్లో ఉన్న బ్యాంకు అధికారులు, యూఎఫ్బీయూ నాయకులు శ్రీకాంత్, నవీన్, టీసీసీబీఈఏ నాయకులు పీ నాగేందర్, ఎం రామస్వామి, ఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.