ఖమ్మం ఎడ్యుకేషన్/రఘునాథపాలెం, నవంబర్ 5: ఉత్సాహం ఉరకలేసింది.. అభిమానం ఉప్పొంగింది.. జనకెరటం ఉవ్వెత్తున ఎగసింది.. వెరసి ఉద్యమ గుమ్మం జన సంద్రమైంది. గులాబీ దళపతి కేసీఆర్ సభకు ఖమ్మం నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అభివృద్ధి ప్రధాత కేసీఆర్ను చూడాలని, ప్రసంగం వినాలనే అభిమానం ప్రజల్లో స్పష్టంగా కన్పించింది. ప్రజా ఆశీర్వాద సభ చుట్టూ పక్కల ఎక్కడా చూసినా ప్రజలు రోడ్లపై బారులు తీరి కన్పించారు. ఖమ్మం నియోజకవర్గంతోపాటు ఇతర నియోజకవర్గాల నుంచి వేలాదిగా జనం సభకు తరలివచ్చారు. ఖమ్మం నగరంలో ఎటుచూసిన జనసమూహంతో రోడ్లు కిటకిటలాడాయి. వందలాది ప్రైవేట్ వాహనాల్లో ప్రజలు నలుమూలల నుంచి తరలివచ్చారు. మహిళలు, వృద్ధులు, యువత, అభిమానులు సీఎం కేసీఆర్కు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో వేలాదిగా హాజరై కేసీఆర్కు బ్రహ్మరథం పట్టారు. ఎటుచూసిన పార్టీ గులాబీ జెండాలతో నగరమంతా గుభాలించింది. ఎస్.ఆర్.అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానమంతా జనసంద్రంగా మారింది. భారీగా తరలివచ్చిన ప్రజలకు ఉత్తేజానిచ్చేలా కేసీఆర్ ప్రసంగం సాగింది. సభ విజయవంతం కావడం, తమ అధినేత ప్రసంగం.. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
సీఎం కేసీఆర్ సభకు వేల సంఖ్యలో మహిళలు, యువత హజరుకావడం కొత్త జోష్ నింపింది. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మహిళా సాధికారతకు అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ మొదలైన పథకాలు మహిళల్లో మనసును దోచుకున్నాయో.. సభకు వచ్చిన మహిళలను చూస్తే అర్థమవుతోంది. మరోవైపు యువత కూడా వేలాదిగా సభకు స్వచ్ఛందంగా తరలిరావడం విశేషం. సీఎం మాట్లాడుతున్నంతసేపు.. యువత కేరింతలతో సభాస్థలి మార్మోగింది. సభా ప్రాంగణమంతా కేరింతలతో సందడిగా మారింది.
కేసీఆర్ ప్రసంగం ఎవరి ప్రసంగంతో పోల్చలేం. మళ్లీ బీఆర్ఎస్ పారీనే అధికారంలోకి వస్తది. ఆంధ్రోళ్లు తెలంగాణోళ్లని పట్టించుకోలే. కేసీఆర్ సారూ వచ్చాక ఖమ్మం, తెలంగాణ మొత్తం బాగుపడ్డది. బంగారు తెలంగాణ కేసీఆర్ వల్లనే ఐనది.
భారత రాష్ట్ర సమితి పార్టీ పాలన ఎంతో బాగుంది. సీఎం కేసీఆర్ పాలన అద్భుతంగా ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం సంక్షేమ పథకాలే. వేల కోట్ల రూపాయాలను ఖమ్మం అభివృద్ధికి కేటాయించి తక్కువ కాలంలో ఎక్కువ ప్రగతి సాధించిన పార్టీ బీఆర్ఎస్. అభివృద్ధికే నా ఓటు.అందరి బాగు కోసం సంక్షేమ పథకాలను పెట్టి మాకు అందిస్తున్న మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్.
ఎన్ని నక్క జిత్తుల పార్టీలు వచ్చినా, ఎన్ని మాయలు చేసినా కారు పార్టీ ముందు నిలబడలేవు. బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు. మళ్లీ సీఎంగా కేసీఆరే వస్తారు. సంక్షేమ పథకాలు తూ.చ తప్పకుండా అమలు చేస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్. ఈ పథకాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. కేసీఆర్ సారూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడమే కాకుండా అమలు చేస్తున్న ఘనత బీఆర్ఎస్కే దక్కింది.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్నోళ్లు తెలంగాణాకు అన్యాయం చేసిండ్రు. రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ పది ఏండ్లలో చేసిన పాలన అద్భుతం. పక్క రాష్ర్టాలు కూడా మనకెళ్లే చూసేటట్టు అభివృద్ధి చేసిండు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను పెట్టి మా ఇండ్లకు వచ్చి షాదీముబారక్, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఇండ్లకు పోయి చెక్కులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే.