మధిర, ఏప్రిల్ 01: అక్రమ అరెస్టులతో పోరాటాలను ఆపలేరని సీపీఎం మధిర డివిజన్ నాయకులు శీలం నరసింహారావు, పాపినేని రామ నరసయ్య అన్నారు. మంగళవారం స్థానిక పోలీసులు సీపీఎం నాయకులను అరెస్ట్ చేసి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం వేయడం ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలన్నారు.
ప్రభుత్వ భూములను సామాజిక అవసరాల కోసం ఉపయోగించాలే తప్పా, వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకూడదన్నారు. ప్రభుత్వ భూముల వేలం పాటలను ఆపాలన ఉద్యమిస్తున్న వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. ఇప్పటికైనా యూనివర్సిటీ భూములను అమ్మే ఆలోచనను మానుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మధిర పట్టణ కార్యదర్శి పడకంటి మురళి, టౌన్ కమిటీ సభ్యులు వడ్రాణపు మధు, నాయకులను తదితరులు పాల్గొన్నారు.