కొత్తగూడెం టౌన్, ఏప్రిల్ 17: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లితండా గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కన్సోతు ధర్మా మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని, ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజలను నట్టేట ముంచిందని ఆరోపించారు.
రాష్ట్రంలోని 25 లక్షల మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కావాల్సి ఉండగా.. ఇంతవరకు వాటి ఊసే లేదన్నారు. కొత్త రేషన్ కార్డులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో కాట్రాల తిరుపతిరావు, బానోత్ కుమారి, జ్యోతిరాం, కొమరారెడ్డి, బానోత్ మోతి, కున్సోత్ సునీల్, దరావత్ వీరు, బానోత్ కిషన్ పాల్గొన్నారు.