ఇల్లెందు, జులై 31 : సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు,అజ్ఞాత దళ నేత అమరుడు కామ్రేడ్ పూనెం లింగన్న ఆశయాలు సాధనకై పోరాడాలని సిపిఐ(ఎమ్-ఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు పట్టణ కార్యదర్శి ఎండి. రాసుద్దీన్, ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు కొక్కుసారంగపాణి పిలుపునిచ్చారు.
గురువారం ఇల్లెందు న్యూడెమోక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కామ్రేడ్ లింగన్న 6వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడుతూ భూమి, భుక్తి, విముక్తి కోసం నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యం కొరకు ప్రతిఘటన పోరాటంలో కామ్రేడ్ లింగన్న అమరుడయ్యారని అన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల సాధన కొరకు వాటి పట్టాల కొరకు ఎన్నో పోరాటాలు నిర్వహించారని అన్నారు. లింగన్న ఆశయ సాధన కొరకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి ట్రైబల్ ఫారం(ఏఐటిఎఫ్) జిల్లా కన్వీనర్ మోకాళ్ళ రమేష్ సిపిఐ(ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు తోడేటి నాగేశ్వరరావు, కొండపల్లి శ్రీనివాస్, రావూరి ఉపేందర్ రావు, పిడబ్ల్యూ జిల్లా నాయకురాలు మోకాళ్ళ సుగుణ, ఐఎఫ్టియు ఏరియా కమిటీ నాయకులు రామిశెట్టి నరసింహారావు, డి.నూనేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.