మధిర, నవంబర్ 11 : పత్తి సాగు చేసిన కౌలు రైతులు ఏఈఓ ల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మధిర వ్యవసాయ సహాయ సంచాలకుడు స్వర్ణ విజయచంద్ర అన్నారు. మంగళవారం మధిర ఏడీఏ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పత్తి పంటను సాగు చేసిన కౌలు రైతాంగానికి సీసీఐ ద్వారా అమ్ముకునే అవకాశం కల్పించిందన్నారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం కౌలు రైతుల రిజిస్ట్రేషన్ ఏఈఓ లు కపాస్ కిసాన్ యాప్ ద్వారా నమోదు చేయడం జరుగుతుందన్నారు. వారి గ్రామాల్లో గల రైతు సోదరులందరూ తమ వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలన్నారు.