‘ఆహ్లాదకరమైన వాతావరణం అందించడం.. అన్ని హంగులతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. మురుగు సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టడమే ప్రధాన కర్తవ్యం. అంతేకాక ఖమ్మానికే అందం తెచ్చిన లకారం ట్యాంక్ బండ్ వద్ద మరో అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నాం’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. నగరంలోని లకారం ట్యాండ్ బండ్ వద్ద ఉన్న మురుగు కాల్వను ఆదివారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి రూ.10 కోట్లతో అండర్ గ్రౌండ్ పైపులైన్ ద్వారా మురుగు, వర్షపు నీరు వేర్వేరుగా వెళ్లేందుకు పకా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
– ఖమ్మం, జూలై 23
ఖమ్మం, జూలై 23 : నగర ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యానికి లకారం ట్యాంక్ బండ్లో మరో అద్భుతం ఆవిషరణ కాబోతున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నగరంలోని రెండు లకారం ట్యాంక్ బండ్ల మధ్య ఉన్న మురుగు కాల్వను శుభ్రం చేసి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా మురుగు తొలగించి చేపట్టిన సుందరీకరణ పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగర ప్రజలు దీర్ఘ కాలంగా ఎదురొంటున్న మురుగు సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కార్యాచరణ చేపట్టామని అన్నారు. అందుకు రూ.10 కోట్ల నిధులు మంజూరు శామని, ఆ నిధులతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అన్నారు.
ఖమ్మం వైరా రోడ్డులోని నాగార్జున ఫంక్షన్ హాల్ నుంచి చెరువు బజార్ మజీద్ వరకు రూ.10 కోట్లతో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా మురుగు, వర్షపు నీరు వేర్వేరుగా వెళ్లేందుకు పకా ప్రణాళికతో కార్యాచరణ చేపట్టామన్నారు. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా మురుగు నీరు ప్రకాష్ నగర్ వద్ద సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కి వెళ్లి, అకడ శుద్ధి చేయబడుతుందన్నారు. మరో పైప్ లైన్ ద్వారా వెళ్లిన వర్షపు నీరు నేరుగా మున్నేరులో కలుస్తాయన్నారు. ఈ ప్రక్రియతో పొల్యూషన్ రహితంగా ఎకడా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉంటుందన్నారు. అండర్‌గ్రౌండ్‌లో పైప్‌లైన్ పై భాగంలో ప్రజలకు ఆహ్లాదం పంచే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. అనంతరం పనులు పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరో మూడు నెలల్లో మురుగు కాలువలను సుందరీకరిస్తామన్నారు. మంత్రి వెంట నగర మేయర్ పునుకొల్లు నీరజ, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు ఉన్నారు.