కారేపల్లి, నవంబర్ 10 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ ధరావత్ నాగేంద్రబాబు అన్నారు. కారేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. మొదటి విడతగా మండల వ్యాప్తంగా 700 ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. వీటిల్లో 642 ఇండ్లు నిర్మాణాలు మొదలుపెట్టగా, 152 ఇండ్లు స్లాబ్ లెవెల్, 312 ఇండ్లు గోడల లెవెల్ పూర్తి చేసుకోగా 178 వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నట్లు చెప్పారు. అదే విధంగా 2వ విడుతలో ఐటీడీఏ ద్వారా 294 ఇండ్లు మంజూరైనట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 90 రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేసి చివరి బిల్లులు తీసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.