తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా ఇస్తుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. గతంలో ఉన్న తిప్పలు ఇప్పుడు లేవు. సమయం ప్రకారం బోరుబావులకు వెళ్లి నీళ్లు పెట్టుకుని ఇతర పనులు చేసుకుంటున్నాం. గతంలో మాదిరిగా రాత్రిపూట కరెంటు ఇచ్చే క్రమంలో బావుల వద్దకు వెళ్లాల్సిన పనితప్పింది. గతంలో ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోయేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేక పంటలు పుష్కలంగా పండుతున్నాయి. మద్ధతు ధర వస్తుంది. కాంగ్రెస్ మూడు గంటల కరెంటు మాటలు చెప్పడం రైతులను ఆగం చేయడమే.
తెలంగాణ ప్రభుత్వం 24గంటల పాటు వ్యవసాయానికి అందిస్తున్న కరెంట్ సరఫరాతో సాగు నీటికి డోకాలేదు. గతంలో వానదేవుడ్ని నమ్ముకొని పంట సాగు చేసేవాళ్లం. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఉన్నాడనే ధైర్యంతో సంబురంగా వ్యవసాయం చేస్తున్నాం. ఒకప్పుడు వరి పంటకు నీళ్ల తడి లేక పొలాలు బీటలు పారి చేతికందిన పైరు ఎండిపోయేది. ఇప్పుడు ఆ భయమే లేదు. మిషన్ కాకతీయతో కుంటల నిండా నీళ్లు ఉంటున్నాయి. దానికి తోడుగా ఉచిత కరెంట్ సరఫరా ఉంటుంది. రెండు పంటలు వేసినా సాగు నీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. సీఎం కేసీఆర్‌ను రైతు కుటుంబాలు గుండెల్లో పెట్టుకుంటాయి. మళ్లీ కారే గెలవాలి..సారే సీఎం కావాలి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో తమ పంటలను పండించుకోగలుగుతున్నాం. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ కష్టాలు లేవు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ కరెంట్ కష్టాలు వస్తాయి. రాత్రి వేళల్లో మోటర్లతో పంటలకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్‌షాక్‌తో చనిపోయారు. అప్పటి రోజులు తలచుకుంటేనే భయంగా ఉంది. సీఎం కేసీఆర్ పాలనలో నిరంతరం కరెంట్ సరఫరాతో రెండు పంటలు పుష్కలంగా పండుతున్నాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి.
పట్టా భూముల భద్రతకు ధరణీ భరోసానిస్తున్నది.పట్టాదారుకు తెలియకుండా సెంటు భూమి కూడా రికార్డుల్లో మార్పులు చేయడానికి కుదరదు.అలాంటి ధరణీపోర్టల్ను కాంగ్రెసోల్లు అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామంటే రైతులు ఊరుకుంటారా..? చిత్తు చిత్తుగా ఓడించి మళ్లీ రోడ్ల మీద తలెత్తుకోకుండా చేస్తారు. సీఎం కేసీఆర్ ముందస్తు ఆలోచనతో ధరణిని అందుబాటులోకి తీసుకువచ్చి ఎన్నో దశాబ్దాల నాటి భూ సమస్యలకు పరిష్కారం చూపించారు. దేవుడు లాంటి కేసీఆర్ సార్ మళ్లీ సీఎం కావాలి. రైతు కుటుంబాలే బీఆర్ఎస్ను మూడో సారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ముందు అది గుర్తుపెట్టుకోవాలి. ఊసరవెల్లిలా రంగులు మార్చే మిమ్మల్ని నమ్మి మోసపోవడానికి రైతన్నలు తెలివితక్కువవాళ్లు కాదు. కారు గుర్తుకే ఓటేస్తాం..పది మందితో వేయిస్తాం..అందులో తగ్గేదేలేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చిన తర్వాత దళారుల బాధ తప్పింది. గతంలో రిజిస్ట్రార్ కార్యాలయాలు, దళారుల చుట్టూ రిజిస్ట్రేషన్ కోసం తిరగాల్సి వచ్చింది. నేడు ఆ పరిస్థితి లేదు. మీసేవాలో స్లాట్ బుక్ చేసిన వెంటనే తహసీల్దార్ కార్యాలయాల్లో నిముషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ధరణి వచ్చినప్పటి నుంచి రైతుల భూముల రక్షణ విషయంలో నిశ్చింతంగా ఉంటున్నాం. మళ్లీ పాతరోజులు వస్తే వీఆర్వోలు, వీఆర్ఏలు, ఆర్ఐల చుట్టూ తిరగాల్సి వస్తుందేమోనని భయమేస్తుంది. కాంగ్రెస్ పాత విధానాలు అవలంభిస్తే తిప్పలు తప్పవు. రైతులు జాగ్రత్తగా ఉండి ఆలోచనతో ఓటువేయాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌తో గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. గత పాలకుల హయాంలో వీఆర్వోలు, రికార్డులు మార్చేవారు. దీంతో గ్రామాల్లో నిత్యం గొడవలు జరిగేవి. కానీ నేడు ధరణి వచ్చాక భూ రికార్డులు భద్రంగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భూ క్రయ, విక్రయాలు తహసీల్దార్ కార్యాలయంలోనే సజావుగా జరుగుతున్నాయి. ధరణితో భూములకు భద్రత ఉంది…దళారుల వ్యవస్థ పోయి రైతులకు మేలు జరుగుతుంది. ధరణి ఉండాల్సిందే… కేసీఆర్ సార్ మళ్లీ రావాల్సిందే.
ఆ బాధలొద్దు.. కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. కరెంటు లేక రాత్రిపూట పొలాల్లో పడుకోవాల్సిన పరిస్థితి ఉండేది. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇస్తుంటే పుష్కలంగా బోరుబావులు పనిచేస్తున్నాయి. మళ్లీ కాంగ్రెస్ అంటేనే భయమేస్తుంది. వ్యవసాయంపై అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు మూడు గంటలే కరెంటు ఇస్తాం…10హెచ్‌పీ మోటరు పెట్టుకోవాలంటే రైతులు ఆ బాధలు మళ్లీ పడలేరు. మళ్లీ కేసీఆరే రావాలి. వ్యవసాయం పండుగ కావాలి.
వ్యవసాయంపై కాంగ్రెస్ నాయకులకు ఏ మాత్రం అవగాహన లేదు. ఆరుగాలం కష్టపడితే తప్ప పంటలు పండటంలేదు. మెరుగైన విద్యుత్ సరఫరా, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు అవసరం ఉంటుంది. ప్రధానంగా పెట్టుబడి పైసలు కావాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇవన్నీ అందిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులకు ఇవేమీ తెలియదు. కేసీఆర్ సార్ ధరణిని తీసుకువచ్చి రికార్డులన్నీ సరిచేసి భూమిపై సర్వహక్కులు కల్పించి భూమిపై పాస్‌బుక్‌లు ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు మళ్లీ వస్తే సమస్యలు మళ్లీ మొదలవుతాయి. మళ్లీ బీఆర్‌స్సే అధికారంలోకి రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి.
రైతులకు మూడు గంటల కరెంటు చాలు, 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు దారుణం. తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇవ్వడం వలన రైతులు పుష్కలంగా పంటలు పండించుకుంటున్నారు. కరెంటు కోతలు లేవు. ఎప్పుడు అంటే అప్పుడు వెళ్లి మోటర్లు ఆన్ చేసుకొని పంటలకు నీళ్లు పెట్టుకుంటున్నాం. కాంగ్రెస్ వస్తే మళ్లీ రైతులకు కరెంటు కష్టాలు తప్పవు. పాత రోజులు వస్తాయి. కరెంటు ఇచ్చిన కేసీఆర్‌కు అందరూ మద్దతు ఇవ్వాలి.
ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతుల భూములకు పటిష్ట రక్షణ కల్పించింది. మధ్యవర్తుల బాధలు తొలిగి పొయాయి. రైతు వేలు ముద్ర పెడితేనే రిజిస్ట్రేషన్ ద్వారా ఇతరులకు స్వల్ప సమయంలోనే భూమి బదిలీ అవుతుంది. రైతు ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి కూడా రైతు భూమిని మార్చలేడు. అటువంటి ధరణిని కాంగ్రెస్ రద్దు చేస్తామంటుంది. మళ్లీ పాత పద్దతి తెస్తామంటుంది. అలాంటప్పుడు కాంగ్రెస్‌కు రైతులు ఓట్లు ఎందుకు వేయాలి. కాంగ్రెస్‌కు ఓటు వేయం.. గోస పడము. రైతన్నకు అండగా నిలిచిన బీఆర్ఎస్కే మా మద్దతు ఉంటుంది.
ధరణి పోర్టల్‌ను ఎత్తివేయాలని కాంగ్రెసోళ్లు అంటున్నారు. అలా జరిగితే రైతుల మధ్య చిచ్చు పెట్టినట్లే. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల భూములకు రక్షణ లేకుండా పోయింది. మరోపక్క కరెంట్ కష్టాలు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు భూరికార్డుల్లో పేర్లు నమోదు చేయించుకున్నారు. రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకొని ఒకరి భూమిని మరొకరికి బదలాయించి రైతులను ముంచారు. ధరణి పోర్టల్ వచ్చాక రైతుల భూముల రికార్డులు భద్రంగా ఉన్నాయి. కాంగ్రెసోళ్లు తెచ్చే భూమాత వద్దు ధరణియే కావాలి.