కూసుమంచి, డిసెంబర్ 10: మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మార్కెటింగ్, చేనేత జౌళి పరిశ్రమలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తొలిసారి ఆదివారం హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లాకు విచ్చేశారు.
వారికి నాయకన్‌గూడెం టోల్ ప్లాజాక వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మంత్రులు వ్యాన్‌పై నించుని వారందరికీ అభివాదం చేశారు. వారి వెంట ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.