ఇల్లెందు రూరల్, నవంబర్ 7 : ఎన్నికల ముందు ప్రజలకు 420 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. పట్టణంలోని సుభాష్ నగర్లో గల ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షుడు శీలం రమేశ్ అధ్యక్షతన గురువారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ తప్ప డైరెక్షన్ పాలన లేదని, సీఎం సీటుకే గ్యారెంటీ లేని పరిపాలన సాగుతున్నదన్నారు. ప్రతిపక్షంలో ఉన్న మా పార్టీ క్యాడర్, నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఊరూరా మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు మరింతగా శ్రమించాలన్నారు. ఉప ఎన్నికలు వస్తే గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. రైతుబంధు, రైతుబీమా అమలు చేయడం లేదని, పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్, సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్, నాయకులు లకావత్ దేవీలాల్‌నాయక్, లక్కినేని సురేందర్, దాస్యం ప్రమోద్‌కుమార్, నాయకులు ఖమ్మంపాటి రేణుక, ఘాజీ, సిలివేరి సత్యనారాయణ, జేకే శ్రీను, వల్లాల మంగమ్మ, పూనెం కమల, యలమద్ది రవి, అజ్మీరా బావ్‌సింగ్, కాంతారావు, నిట్ట భాస్కర్‌రావు, గిన్నారపు రాజేశ్, అబ్దుల్ నభి, హరికృష్ణ, నిఖిల్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.