దమ్మపేట, డిసెంబర్ 7: పంచాయతీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆదివారం దమ్మపేట మండలంలోని మారప్పగూడెం పంచాయతీ జలవాగు గ్రామంలో కాంగ్రెస్‌కు చెందిన 45 కుటుంబాల వారు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన అనంతరం మెచ్చా మాట్లాడుతూ కాంగ్రెస్ పతనం గ్రామాల నుంచి మొదలైందని, కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు గులాబీ జెండా నీడకోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో సుభిక్షంగా ఉన్న గ్రామాలు నేడు విలవిలలాడుతున్నా కన్నెత్తిచూసే నాధుడేలేడని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ రెండేళ్లుగా ఒరిగిందేమీలేదన్నారు. పార్టీలో చేరిన వారిలో రాంబాబు, తుర్రం రాముడు, కృష్ణ, తాటి ఏసుబాబు, తాటి ముత్యాలు, పూనం పోతురాజు, పూనం భద్రమ్మ, మహాలక్ష్మి, పొట్ట లక్ష్మి, కుంజ పోలయ్య, మడివి గంగరాజు, చాపా శ్రీను, ఊకే చిన్నయ్య, తుర్రం వెంకటేష్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ రమేష్, ఆళ్ల జంగం, కోర్స వెంకటేష్, కోర్స శ్రీను, చారుగుల్ల నాగు, మోడియం ముత్యాలరావు పాల్గొన్నారు.
దమ్మపేట కాంగ్రెస్ నాయకుడు చిన్నంశెట్టి మధు ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన 6 కుటుంబాలు, ఇతర పార్టీలకు చెందిన 5 కుటుంబాల వారు ఆదివారం రాత్రి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాటిసుబ్బన్నగూడెంలోని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నివాసంలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చిన్నంశెట్టి మధు, వాడవల్లి మణికంఠ, కొలికపోగు రమేష్, శ్యాంకూరి ఐజాక్, పార్స లక్కీ, నూత్తులపాటి నరేష్, కొయ్యల గౌరీశంకర్, ఎన్.నవీన్‌కుమార్ తదితరులు ఉన్నారు.