– మరో 35 కుటుంబాలు
– పార్టీ కండువా కప్పి స్వాగతం పలికిన ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల
ఖమ్మం రూరల్, జనవరి 29 : ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఒక్కసారిగా మున్సిపాలిటీలో సమీకరణాలు మారుతున్నాయి. కొద్దిరోజుల క్రితం గుర్రాలపాడు 7వ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని అతడిని 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దీనికి కౌంటర్ అటాక్ అన్నట్లు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేత బొల్లం నాగయ్య తన అనుచరులతో కలిసి గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గుర్రాలపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో బొల్లం నాగయ్య గ్రామంలోని అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్, నండ్రా ప్రసాద్, డీసిసిబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం. మాజీ జడ్పీటీసీ వై.ప్రసాద్, మళ్లిడి వెంకన్న, భారీ మాల్సుర్, తెలుగుదేశం నేత బొబ్బల కృష్ణయ్య, కత్తి వెంకన్న పాల్గొన్నారు.

Khammam Rural : గులాబీ గూటికి చేరిన కాంగ్రెస్ నేత బొల్లం నాగయ్య