చండ్రుగొండ, ఏప్రిల్ 5: భద్రాద్రి జిల్లా చండుగొండ మండలంలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. చండ్రుగొండ మండలానికి వచ్చే మిషన్ భగీరథ పైపులైన్ అన్నపురెడ్డిపల్లి మండలం వద్ద వారం రోజుల కింద మరమ్మతులకు గురైంది.
అప్పటి నుంచి ప్రభుత్వంగానీ, యంత్రాంగంగానీ స్పందించడం లేదు. దీంతో మండలంలోని సుమారు 40కి పైగా గ్రామాలకు వారం రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. ఫలితంగా ప్రజలు మంచినీటి కోసం అల్లాడుతున్నారు. అసలే వేసవికాలం కావడంతో చిన్నారులు, వృద్ధులు, పెద్దలు దాహార్తితో తల్లడిల్లిపోతున్నారు. పలు పంచాయతీల సిబ్బంది ఆయా పంచాయతీల ట్రాక్టర్ల ట్యాంకర్లతో ద్వారా కొన్ని గ్రామాల్లో కొంతమేరకు నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ.. అవి గ్రామస్తులకు సరిపోవడం లేదు.