కొణిజర్ల, అక్టోబర్ 10 : రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే తిరిగి కేసీఆర్ సీఎం కావాలని, రాష్ట్రం ప్రగతి పథంలో నడిచేందుకు బీఆర్ఎస్ను బలపరుద్దామని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్‌లాల్ స్పష్టం చేశారు. మంగళవారం కొణిజర్లలో కాంగ్రెస్, టీవైఎస్ఆర్సీపీ నుంచి 48 కుటుంబాలు మదన్‌లాల్ సమక్షంలో గులాబీ గూటికి చేరాయి. ఈ సందర్భంగా వారికి గులాబీ కం డువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా పెద్దఎత్తున బీఆర్ఎస్కు ప్రజాదరణ లభిస్తుందన్నారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని బలపరిస్తే నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని, ప్రతిఓటరుకు అండదండగా ఉంటానన్నారు. ఆ పార్టీ జిల్లా నాయకులు బోడపోతుల ఆధ్వర్యంలో కచ్చిమళ్ల సతీశ్, కచ్చిమళ్ల సుధాకర్, చింతల రామలక్ష్మణులు, యామాల సునీత, చింతల వాసుతో పాటు, తదితరులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వై.చిరంజీవి, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, బోడపోతుల బాబు, పోట్ల శ్రీనివాసరావు, పాముల వెంకటేశ్వర్లు, కిలారు కిరణ్, జడ మల్లేశ్‌యాదవ్, దొడ్డపునేని రామారావు, పొట్లపల్లి జీడయ్య, దావా విజయ్, చల్లగుండ్ల రమేశ్, కొమ్మినేని వెంకటేశ్వర్లు, షేక్ మౌళానా, కల్వకుంట్ల వెంకటరత్నం, చల్లా నరసింహారావు, భక్యా మీటు పాల్గొన్నారు.
కల్లూరులో…
మండలంలోని తాళ్లూరు వెంకటాపురంలో కాంగ్రెస్, టీడీపీల నుంచి సుమారు 100 కుటుంబాలు మంగళవారం జడ్పీటీసీ కట్టా అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండేందుకు తాము పార్టీలో చేరుతున్నట్లు చేరిన వారు ప్రకటించారు. ఎమ్మెల్యే సండ్రకు తాము అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో మోదుగు సుదర్శన్, అరిగెల బాబు, మోదుగు రవి, మోదుగు ప్రభాకర్, మోదుగు స్వరాజ్యం, అరిగెల కృష్ణయ్య, మోదుగు నాగమ్మ, రాణెమ్మ, పుల్లయ్య, బొల్లిపోగు మల్లయ్య, అరిగెల రమేశ్, ఆదామ్, నవీన్, ధర్మారావు, ప్రభాకర్‌రావు, సర్పంచ్ సుబ్బారావు, ఎంపీటీసీ మేరమ్మ, సొసైటీ చైర్మన్ నర్వనేని అంజయ్య పాల్గొన్నారు.