
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో డెంగ్యూ, మలేరియా, డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని నాలుగు ప్రాంతాలలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, నగర మేయర్ పునుకొల్లు నీరజలు వైద్య సిబ్బందిపర్యటించారు. డెంగ్యూ కేసులున్న ప్రాంతాల్లో తిరిగి కమీషనర్ అక్కడి ప్రజలకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
డెంగ్యూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ,డెంగీ సోకితే అనుసరించాల్సిన విధానాలను గురించి మలేరియా సిబ్బంది జనాలకు తెలిపారు. డెంగ్యూ సోకిన ప్రాంతాలలో చుట్టుప్రక్కల నివసించే వారు అప్రమత్తంగా ఉండి వ్యాధి ప్రబలకుండా చూసుకోవాలని మున్సిపల్ కమీషనర్ సూచించారు.