భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అత్యంత విలువైన వజ్రాయుధం అని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత కలిగిన పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కుకు ఎంతో విలువ ఉందని, ఆ విలువను ప్రతి ఓటరు తెలుసుకొని తమ అమూల్యమైన ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటుహక్కుపై విస్తృత అవగాహన కల్పించడం ద్వారా సువర్ణవంతమైన, బాధ్యతాయుతమైన పాలనను ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో సీపీవో సంజీవరావు, మహిళా శిశు సంక్షేమాధికారి స్వర్ణలత లెనీనా, బీసీ సంక్షేమాధికారి విజయలక్ష్మి, ఏవో అనంత రామకృష్ణ, ఎన్నికల సూపరింటెండెంట్ రంగాప్రసాద్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.