భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన ప్రతి రైతు రుణమాఫీ చేస్తామని, మూడు విడతల్లో 57,983 మంది రైతులకు రూ.415.34 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.
కలెక్టరేట్లో శనివారం ఆయన మాట్లాడుతూ మొదటి విడత రుణమాఫీలో 28,801 మంది రైతులకు రూ.136.64 కోట్లు, రెండో విడతలో 17,309 మంది రైతులకు రూ.147.33 కోట్లు, మూడో విడతలో 11,873 రైతులకు రూ.131.36 కోట్లను ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తితే గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.