చుంచుపల్లి, అక్టోబర్ 23 : వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన డీలర్లు తప్పనిసరిగా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఇన్పుట్(దేశీ) ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. చుంచుపల్లి మండలం రామవరం రైతు వేదికలో 7వ బ్యాచ్ దేశీ సభ్యుల ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. 40 మంది వ్యవసాయ అనుబంధ రంగాల డీలర్లు 48 వారాలపాటు శిక్షణ పూర్తి చేసుకుకోగా.. వారికి కలెక్టర్ సర్టిఫికెట్ల్లు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వ్యాపారం చేస్తున్న వారికి దేశీ పేరుతో 12 నెలల డిప్లొమా కోర్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా.. శిక్షణ పూర్తి చేసుకొని ధ్రువపత్రాలు తీసుకున్న వారికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఏవో బాబూరావు, రిటైర్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ డేవిడ్ జయపాల్, దేశీ వ్యవసాయ కోర్సు శిక్షకుడు దీపక్, రాజేశ్వరి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.