పాల్వంచ, నవంబర్ 10: ఏ ఒక్కరినీ వదలకుండా, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్యూమరేటర్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. పాల్వంచ మున్సిపాలిటీలోని బొల్లోరిగూడెం 11వ వార్డులో సర్వేను ఆదివారం పర్యవేక్షించారు.
వివరాల సేకరణలో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని ఎన్యూమరేటర్లను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు ఉంటే వెంటనే సూపర్వైజర్లకు, ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్యూమరేటర్లకు సహకరించాలని ప్రజలను కోరారు.