చండ్రుగొండ, సెప్టెంబర్ 15: మండల పరిధి బెండాలపాడు గ్రామ శివారులోని కనిగిరి (కనకాద్రి) గుట్టలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం సందర్శించారు. ఉదయం 7 గంటలకు బెండాలపాడు ఆదివాసీ గిరిజనులతో కలిసి అడవిలోకి కాలినడక వెళ్లి ప్రకృతి అందాలను ఆశ్వాదించారు. గుట్టలపై కాకతీయుల కాలంలో కట్టిన వీరభద్రుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కట్టడాలను పరిశీలించారు.
తన వెంట జిల్లా, ఇతర అధికారులెవ్వరినీ తీసుకెళ్లలేదు. బెండాలపాడులో వెదురుతో తయారుచేసే బ్యాంబో క్టస్టర్‌ను సందర్శించారు. కలెక్టర్‌ను ఎంపీడీవో అశోక్, ఎస్సై స్వప్న, సీనియర్ నాయకులు మాలోత్ భోజ్యానాయక్ గ్రామంలో కలిశారు. ప్రకృతి అందాలు బాగున్నాయని కలెక్టర్ స్థానికులకు తెలిపారు.