కారేపల్లి, జూలై 18 : ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. 24 గంటల సదుపాయం గల కామేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో తీసుకురావాలని స్థానికులు కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ వెంట మండల వైద్యాధికారి, ఎంపీడీఓ, తాసీల్దార్ ఉన్నారు.