కారేపల్లి, జనవరి 3: ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలు (సీఆర్టీ)గా విధులు నిర్వహిస్తున్న ఎం. స్వాతిని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం ఘనంగా సన్మానించారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయినీలను ఎంపిక చేసి ఖమ్మం పట్టణంలో గల టీటీడీసీలో జిల్లా కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ శ్రీజ, జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని సన్మానించి సత్కరించారు.