హాస్టల్ భవన నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలి
ఏప్రిల్ చివరినాటికి సీనియర్ హాస్టల్ భవన నిర్మాణాలు బేస్మెంట్ స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. వైరాలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల భవన నిర్మాణ పనులను శనివారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
- కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
వైరాటౌన్, ఏప్రిల్ 11 : ఏప్రిల్ చివరినాటికి సీనియర్ హాస్టల్ భవన నిర్మాణాలు బేస్మెంట్ స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. వైరాలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల భవన నిర్మాణ పనులను శనివారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైరా సాంఘిక సంక్షేమ గురుకులంలో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు.
పనులు మంచి వేగంతో కొనసాగుతున్నాయని, ప్రణాళిక ప్రకారం 4 జూనియర్, 9 సీనియర్ హాస్టల్ బ్లాకులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జూనియర్ హాస్టల్ బ్లాకుల రాప్ట్ ఫౌండేషన్ పనులు జరుగుతున్నాయని, సీనియర్ హాస్టల్ బ్లాకు ఫౌండేషన్ పనులు ప్రారంభించి, పాత భవనాలను తొలగించి, ఏప్రిల్ నెలాఖరు నాటికి బేస్మెంట్ స్థాయికి తీసుకొనిరావాలని అధికారులను ఆదేశించారు.
ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ పాఠశాలలల్లో జూనియర్, సీనియర్ హాస్టల్ బ్లాకులు, అకాడమిక్ బ్లాకులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి నివాసగృహాలు కూడా నిర్మించబడుతున్నాయన్నారు. ఈ స్కూళ్లకు సంబంధించిన భూ సంబంధిత సమస్యలన్నీ పరిష్కరించామని, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట ఈడబ్ల్యూఐఈడీసీ ఈఈ బుగ్గయ్య, వైరా మున్సిపల్ కమిషనర్ గురులింగం, తహసీల్దార్ సురేష్, సంబంధితశాఖల అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

