ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టండి
ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. సుజాతనగర్ మండలం సింగభూపాలెం, వేపలగడ్డ గ్రామాల్లో గురువారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్.. వివిధ అభివృద్ధి, సంక్షేమ, విద్యా కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
- తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి, కూరగాయలు పంటలు వేయాలి
- సుజాతనగర్ మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ అంకిత్
కొత్తగూడెం టౌన్, ఆగస్టు 13 : ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. సుజాతనగర్ మండలం సింగభూపాలెం, వేపలగడ్డ గ్రామాల్లో గురువారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్.. వివిధ అభివృద్ధి, సంక్షేమ, విద్యా కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సింగభూపాలెం చెరువును సందర్శించి, నీటి నిల్వ పరిస్థితులను పరిశీలించారు. ప్రస్తుతానికి 14.5 అడుగుల నీటిమట్టం ఉన్నదని, సుమారు 2,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని చెప్పారు. అనంతరం పాత అంజనాపురంలో రైతులు సాగు చేస్తున్న కూరగాయలు, పెసర, పత్తి పంటలను కలెక్టర్ పరిశీలించారు.
కాకర, సొరకాయ తదితర కూరగాయల సాగును పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. సింగభూపాలెం గ్రామంలో సుమారు 600 ఎకరాల్లో కూరగాయలు, 300 ఎకరాల్లో పెసర సాగు జరుగుతున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ విస్తీర్ణాన్ని మరింత పెంచేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న నీటి వనరుల దృష్ట్యా తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. సింగభూపాలెంలో మొదటి దశలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులతోపాటు రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం చేపడుతున్న సర్వేను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు, ఉద్యానవన శాఖ అధికారి కిశోర్బాబు, తహసీల్దార్ కృష్ణప్రసాద్, వ్యవసాయ శాఖ ఏవోలు, నీటిపారుదల, సంబంధిత శాఖల అధికారులు, సర్వే బృందాల సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

