ఖమ్మం : అభివృద్దిలో ఆదర్శంగా మారిన తెలంగాణలో మనం జన్మించడం అదృష్టంగా భావించాలని టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో అశ్వరావుపేట ఎంఎల్ఏ మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి ఎంపీ నామ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు పార్లమెంట్లో ప్రస్తావిస్తే దేశం ఆశ్చర్యపోతుందని అన్నారు.
కరోనా కాలంలో కూడా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిలిచిపోలేదని, సాగు, తాగు, కరెంటు, ఎరువుల గోసను కేసీఆర్ తీర్చారని నామా అన్నారు. అనంతరం అశ్వరావుపేట, దమ్మపేట, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, కొణిజర్ల మండలాలకు చెందిన లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీలు సోయం ప్రసాద్, బాణోతు పార్వతి,జల్లిపల్లి శ్రీరాంమూర్తి, దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వర్లు, ముల్కలపల్లి, చండ్రుగొండ, వైరా, కొణిజర్ల మండలాల టిఆర్ఎస్ అద్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు, బండి పుల్లారావు, మోరంపూడి అప్పారావు, దారా వెంకటేశ్వర్లు, బాణాల వెంకటేశ్వరరావు, చిరంజీవి, సోసైటీ వైస్ చైర్మన్ నల్లమోతుల వెంకటేశ్వరరావు, నాయకులు రసూల్, వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, రమేష్, కనకమేడల సత్యనారాయణ, చిత్తారు సింహాద్రి, పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, తాళ్లూరి హరీష్ తదితరులు పాల్గొన్నారు.