భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల 5న కొత్తగూడెంలో జరుగనున్న సీఎం కేసీఆర్ ప్రజాశీర్వాద సభను విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. దేశంలో ఎక్కడా అమలు చేయని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు. పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లి కొత్తగూడెంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావును గెలిపించుకోవాలన్నారు.
కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చన్నారు. ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ.. ప్రజలంతా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపించి ఆశీర్విదించాలన్నారు. సమావేశంలో పార్టీ పినపాక ఎన్నికల ఇన్చార్జి కోనేరు సత్యనారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, పార్టీ అధికార ప్రతినిధి జేవీఎస్ చౌదరి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, నాయకులు కాసుల వెంకట్, మండే వీరహనుమంతురావు, బత్తుల వీరయ్య, భూక్యా రాంబాబు, కొత్వాల శ్రీనివాసరావు, బరపటి వాసుదేవరావు, పూసల విశ్వనాథం, లక్కినేని సత్యనారాయణ, ఉమర్ పాల్గొన్నారు.