సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు అండగా నిలుస్తున్నారని, దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం రూ.20 కోట్లతో నిర్మించిన నగరపాలక సంస్థ కార్యాలయ పనులను కలెక్టర్ వీపీ గౌతమ్, నగర మేయర్ నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలతో ఖమ్మం నియోజకవర్గంలో ఏడేళ్లుగా వేలాది మంది నిరుపేదలకు లబ్ధి చేకూరిందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు రూ.20 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న నగరపాలక సంస్థ కార్యాలయాన్ని త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.
ఖమ్మం, ఫిబ్రవరి 4: నగర ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించేందుకు రూ.20 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మితమవుతున్న నగరపాలక సంస్థ కార్యాలయాన్ని త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ తెలిపారు. నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవన ముగింపు పనులను శుక్రవారం ఆయన పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ తరువాత రాష్ట్రంలో ఏ కార్పొరేషన్‌లోనూ లేనివిధంగా ఖమ్మంలోనే ఆధునిక వసతులను సమకూరుస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యాలయ భవనాన్ని అతి త్వరలోనే మంత్రి కేటీఆర్‌తో ప్రారంభించుకోనున్నామన్నారు. అనంతరం నగరంలో ఎక్సైజ్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసుకుంటున్న మరో మోడల్ సమీకృత వెజ్, నాన్ వెజ్ మారెట్ పనులను మంత్రి పరిశీలించారు. కలెక్టర్ వీపీ గౌతమ్, మేయర్ నీరజ, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్‌సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్లు పగడాల శ్రీవిద్య, కమర్తపు మురళి, కొత్తపల్లి నీరజ, టీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, ఇంజినీర్లు ఆంజనేయులు, కృష్ణలాల్, రంగారావు పాల్గొన్నారు.
ఖమ్మం, ఫిబ్రవరి 4: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల రూపంలో ప్రతి ఆడపిల్లనూ ఇంటి పెద్దన్నగా సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 107 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.1.07 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను, 33 మందికి మంజూరైన రూ.18.73 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి అజయ్ శుక్రవారం పంపిణీ చేశారు. 15, 16, 18, 19, 21, 22, 23, 24, 25, 26, 37, 38, 41, 42, 43, 44, 45, 49, 50, 51, 52, 53, 55, 57, 58 డివిజన్లలో పర్యటించారు.
జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు కమర్తపు మురళి, శ్రీదేవి, మేడారపు వెంకటేశ్వర్లు, మందడపు లక్ష్మీ మనోహర్, చామకూరి వెంకటేశ్వర్లు, ఆళ్ల నిరీషా అంజిరెడ్డి, ప్రశాంతలక్ష్మి, గోళ్ల చంద్రకళ, వెంకట్, పల్లా రోజ్లీనా, షేక్ ముక్బుల్, కర్నాటి కృష్ణ, పగడాల శ్రీవిద్య, పాకలపాటి విజయలక్ష్మి, బీజీ ైక్లెమెంట్, పాలెపు విజయలక్ష్మి, బుడిగం శ్రీనివాసరావు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, రాపర్తి శరత్, శీలంశెట్టి రమా వీరభద్రం, బుర్రి వెంకట్, మోతారపు శ్రావణి, దోరేపల్లి శ్వేత, టీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, కృష్ణచైతన్య, దేవభక్తిని కిశోర్, బలుసు మురళీకృష్ణ, తాజుద్దీన్, తౌసిఫ్, షకీనా, సలీం, అర్బన్ తహసీల్దార్ శైలజ తదితరులు పాల్గొన్నారు.