రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమైంది. ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు కృతజ్ఞతా భావంతో మంగళవారం సీఎం కేసీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి.. స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం కేసీఆర్ వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు.
-నమస్తే నెట్వర్క్
ఖమ్మం, ఆగస్టు 1 : టీఎస్ ఆర్టీసీ సంస్థను తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ మంగళవారం కార్మికులు సంబురాలు చేసుకున్నారు. ఖమ్మం రీజియన్ పరిధిలోని ఆరు డిపోల వద్ద వివిధ రూపాల్లో ఆనందం వ్యక్తం చేశారు. ఖమ్మం డిపో వద్ద ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. కార్మికులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం డిపో మేనేజర్ శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ రామయ్య, తెలంగాణ మజ్దూర్ యూనియన్ డిపో కార్యదర్శి మోదుగు రవీంద్రనాథ్, డిపో అధ్యక్షుడు వినోదరావు, చిన్నకోటయ్య తదితరులు మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు, మంత్రి పువ్వాడకు కార్మికులు ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు. మంత్రి పువ్వాడ చొరవతో సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. కార్యక్రమంలో పలువురు కార్మికులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కొత్త బస్టాండ్‌లో కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్‌కు, రవాణా శాఖ మంత్రి పువ్వా డ అజయ్‌కుమార్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం శ్రీనివాస్‌రావు, బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి పాల్వంచ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు ఎండీ.వై.పాషా, బీఆర్టీయూ నాయకులు ఉమామహేశ్వరరావు, వేమా సెల్వరాజు, స్వామి, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
సత్తుపల్లిలో..
సత్తుపల్లి, ఆగస్టు 1 : ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని హర్షిస్తూ.. మంగళవారం సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఉద్యోగులు సీఎం కేసీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డీఎం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల కోరిక తీర్చిన సీఎం కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు. గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కేసీఆర్‌కు ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలపై పూర్తి అవగాహన ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపి వేల కుటుంబాలకు భరోసా కల్పించారన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిపో అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని, బస్టాండ్‌లో అదనంగా రెండు ప్లాట్‌ఫాంల ఏర్పాటుకు, కల్లూరులో నూతన బస్టాండ్ ఏర్పాటుకు శక్తి వంచన లేకుండా చేసిన కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను డీఎం రాజ్యలక్ష్మి, ఆర్టీసీ ఉద్యోగులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ విజయశ్రీ, వెల్ఫేర్ కమిటీ సభ్యుడు కిరణ్‌బాబు, ఆర్టీసీ ఉద్యోగులు, గ్యారేజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలంలో..
భద్రాచలం, ఆగస్టు 1 : భద్రాచలంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, డిపో మేనేజర్ రామారావు మంగళవారం సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగాసందర్భంగా డీఎం మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో కార్మికుల కల నెరవేరినట్లయిందన్నారు. దీంతో కార్మికులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో అల్లం నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
వైరాలో..
వైరాటౌన్, ఆగస్టు 1 : సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. మంగళవారం వైరా బస్టాండ్‌లో ఆర్టీసీ సిబ్బంది, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ భద్రత విషయంలో సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని ఆర్టీసీ సిబ్బందిని ఎమ్మెల్యే వేడుకున్నారు. కార్యక్రమంలో మున్సిపాల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, దిశా కమిటీ సభ్యుడు కట్టా కృష్ణార్జున్‌రావు, జిల్లా నాయకులు కాపా మురళీకృష్ణ, కౌన్సిలర్లు వనమా విశ్వేశ్వరరావు, డాక్టర్ కోటయ్య, సోషల్ మీడియా కన్వీనర్ మోటపోతుల సురేశ్, యువజన విభాగం అధ్యక్షుడు చల్లా సతీశ్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సాదం రామారావు, మహిళా పట్టణ అధ్యక్షురాలు సక్కుబాయి, పట్టణ నాయకులు ఏదునూరి శ్రీను, మరికంటి శివ, జువ్వాజి నాగరాజు, ఫణితి సురేశ్, నందిగామ మనోహర్, దాసరి శ్రీను, ముత్తయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.