ఖమ్మం రూరల్ తాసీల్దార్ ఆఫీస్ ఎదుట సీఐటీయూ ధర్నా
బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ కార్యాలయం ముందు.ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీనివాసరావు మాట్లాడుతూ..
ఖమ్మం రూరల్, జూన్ 30 : బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ కార్యాలయం ముందు.ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వెల్ఫేర్ బోర్డును ప్రభుత్వమే నిర్వహించాలని, క్లైములను వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో కొనసాగించాలని, లక్షల రూపాయలు దుర్వినియోగం చేసే సీఎస్సీ హెల్త్ సెంటర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిధులను ప్రైవేటు కంపెనీ అప్పజెప్పిన నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన బిల్డింగ్ వర్కర్స్ అందరికీ రూ.6 వేలు వేలు పెన్షన్ ఇవ్వాలని, చదువుతున్న విద్యార్ధిని విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వాలని, ఇల్లు ఇళ్ల స్థలాలు లేని బిల్డింగ్ వర్కర్స్ కు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.
ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పెరుమాళ్లపల్లి మోహన్ రావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రూరల్ మండల అధ్యక్షుడు, కార్యదర్శి పూరెల్లి రాములు, గూడెం బ్రహ్మం గౌడ్, మండల నాయకులు గండి నాగయ్య, పెనుగొండ వీరయ్య, నాయకులు యర్రా మల్లికార్జున్ తీగుళ్ల వెంకటరమణ, అమరబోయిన, లింగయ్య, నగేష్, రమణ, దిగచర్ల వెంకన్న పాల్గొన్నారు, అనంతరం రూరల్ మండల డ్యిపూటి తాసీల్దార్ సంపత్ కుమార్కు వినతి పత్రం అందజేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

