మధిర, జులై 07 : మధిర మార్కెట్ యార్డ్లో మిర్చి కొనుగోలును మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు సోమవారం పరిశీలించారు. కాలసాని లక్ష్మీపతి అనే రైతు పండించిన మిర్చి తేజ రకం జెండా పాట రూ.13,200 లతో కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. రైతును రాజు చేయాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అలాగే ప్రజా ప్రభుత్వంలో వరి సన్న ధాన్యానికి రూ.500 బోనస్, రైతు రుణమాఫీ, సాగు పెట్టుబడి కోసం రైతు భరోసా ఎకరానికి రూ.12 వేలు అందజేస్తుందన్నారు. రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.