ఖమ్మంలో తగ్గిన మిర్చి ధర
అనుకున్నదే జరిగింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి వ్యాపారుల జిమ్మిక్కు నిజమని రుజువైంది. పంట తగ్గితే ధర పెంచడం, పంట పెరిగితే ధర తగ్గించడం ఇక్కడ ఏళ్లుగా సాగుతున్న కుట్ర తంతు. దీనిపై ఆదివారం ‘పంట తగ్గింది.. ధర పెరిగింది’ పేరుతో ‘నమస్తే తెలంగాణ’ వార్తను ప్రచురించింది. అనుకున్నట్లుగానే వ్యాపారులు మిర్చి ధరను అమాంతం తగ్గించేశారు.
- ఒక్కరోజే క్వింటాకు రూ.600 ఢమాల్
- ముందే చెప్పిన ‘నమస్తే తెలంగాణ’
రఘునాథపాలెం, ఏప్రిల్ 21: అనుకున్నదే జరిగింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి వ్యాపారుల జిమ్మిక్కు నిజమని రుజువైంది. పంట తగ్గితే ధర పెంచడం, పంట పెరిగితే ధర తగ్గించడం ఇక్కడ ఏళ్లుగా సాగుతున్న కుట్ర తంతు. దీనిపై ఆదివారం ‘పంట తగ్గింది.. ధర పెరిగింది’ పేరుతో ‘నమస్తే తెలంగాణ’ వార్తను ప్రచురించింది. అనుకున్నట్లుగానే వ్యాపారులు మిర్చి ధరను అమాంతం తగ్గించేశారు. సోమవారం రూ.22 వేలు పలికిన క్వింటా మిర్చి ధర మంగళవారానికి రూ.21,400 జెండాపాటగా పలికింది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒకటి రెండురోజులు ధరను పెంచి మిర్చి రైతుల్లో ఆశలు కల్పించడం, పంట పెద్దమొత్తంగా రాగానే అమాంతం తగ్గించేయడం ఇక్కడ వ్యాపారులకు వెన్నతో పెట్టిన విద్య. ఏళ్లుగా వ్యాపారులు సాగిస్తున్న ఈ వ్యవహారంపై మార్కెట్ అధికారులు, పాలకవర్గాలు ఏనాడూ దృష్టి సారించి అరికట్టిన దాఖలాలు లేవు. దీంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారుల ఇష్టారాజ్యానికి తిరుగులేకుండా పోయింది. ఫలితంగా కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్కు వచ్చే రైతులు ఏళ్లుగా వ్యాపారుల ధన దాహానికి బలవుతూనే ఉన్నారు. మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు 25వేల మిర్చి బస్తాలను రైతులు తీసుకొచ్చారు. వ్యాపారులు నెంబర్వన్ మిర్చిని సైతం జెండాపాటకు రూ.2 వేల నుంచి రూ.3 వేల తేడాతో కొనుగోలు చేయడం కనిపించింది.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

