కారేపల్లి, ఏప్రిల్ 11 : పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధా అన్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గిద్దేవారిగూడెంలో గల అంగన్వాడీ 1, 2 కేంద్రాల్లో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందించాలని సూచించారు.
ఎప్పటికప్పుడు పిల్లల బరువు, ఎత్తు చూసి తల్లిదండ్రులకు తెలియజేయాలని అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్ణీత సమయం ప్రకారం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని గర్భిణులకు సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.