కారేపల్లి, (కామేపల్లి) జులై 31: ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని ముచ్చర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించిన కామేశ్వరరావు పదవీ విరమణ సన్మాన సభ గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తాము పనిచేసిన చోట విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్థానిక ప్రజల మన్ననలను పొందాలన్నారు.
పదవీ విరమణ పొందిన కామేశ్వరరావు పాఠశాలకు అందించిన సేవలను కొనియాడారు. ప్రభుత్వం పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటియాఫ్ జిల్లా నాయకులు వట్టికొండ శ్రీనివాస రావు, యం.నరసింహారావు, రమాదేవి, పద్మ, మధుసూదన్ రావు, కామేపల్లి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు నల్లమోతు శ్రీనివాసరావు, జక్కుల వెంకటేశ్వర్లు, యస్.వి,ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.