కారేపల్లి : తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతనాలపై వేసిన పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి, అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సింగరేణి మండలంలో వివిధ పాఠశాలలను సందర్శించిన చావ రవి ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న ఐదు విడతల కరువు భత్యాలను వెంటనే ప్రకటించాలన్నారు. దీర్ఘకాలికంగా పెండిరగులో ఉన్న పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులైన జీపీఎఫ్ లోన్స్, పార్ట్, ఫైనల్స్, టీఎస్జీఎల్ఐ, సరెండర్ బిల్లులు, మెడికల్ బిల్లులను వెంటనే మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పర్యవేక్షణాధికారి పోస్టులైన డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈఓ పోస్టులను పదోన్నతి ద్వారాభర్తీచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, సింగరేణి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ.కఅష్ణారావు, బానోత్ మంగీలాల్, మండల కార్యదర్శి ఏటుకూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.