అర్హుల ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్తగా పర్యవేక్షించండి
ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలో జరుగుతున్న (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
- గణన ఫారాలు నింపడంలో ఓటర్లకు సహాయ సహకారాలు అందించండి
- బీఆర్ఎస్ ఖానాపురం బీఎల్ఏల సమావేశంలో మాజీ మంత్రి అజయ్
- బీఎల్ఏలకు ఫోన్ ద్వారా దిశానిర్దేశం చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రఘునాథపాలెం, జూలై 3: ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలో జరుగుతున్న (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపై ఖమ్మం టూటౌన్, త్రీటౌన్తోపాటు ఖానాపురం హవేలీ, రఘునాథపాలెం మండలం పంగిడి గ్రామాల్లో బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ)లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఇంటినీ సందర్శించాలని, గణన ఫారాలు నింపడంలో ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అలాగే, అర్హత ఉన్న ఏ ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించాలని బీఎల్ఏలను ఆదేశించారు. ప్రజలు సైతం ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి అవసరమైన పత్రాలతో నిర్ణీత సమయానికి బీఎల్వోలకు అందించాలని కోరారు. ఫారాలు నింపడం, పాత ఓటరు వివరాల గుర్తింపు లేదా ఎస్ఐఆర్ సందేహాలపై ప్రజలు సంకోచించకుండా బీఆర్ఎస్ బీఎల్ఏలను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. వారు పూర్తి సహకారం అందిస్తారని తెలియజేశారు.
ఫోన్ ద్వారా కేటీఆర్ దిశానిర్దేశం..
ఖమ్మం ఖానాపురం హవేలీలో జరిగిన బీఆర్ఎస్ బీఎల్ఏల సమావేశంలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువనేత కేటీఆర్ ఫోన్ ద్వారా ఏజెంట్లకు దిశా నిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికీ సమర్థవంతంగా తీసుకెళ్లాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందించాలని సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తా అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం విజయవంతం కోసం అనుసరించాల్సిన పలు సూచనలు, మార్గదర్శకాలను వివరించారు. బీఆర్ఎస్ నేతలు కూరాకుల నాగభూషణం, గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్, గుత్తా రవి, అజ్మీరా వీరూనాయక్, శీలంశెట్టి రమా వీరభద్రం, మక్బూల్, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, పల్లా రోజ్లీనా, నాగండ్ల కోటి, బత్తుల మురళి, మెంతుల శ్రీశైలం, ఎర్రా అప్పారావు, పాలడుగు పాపారావు, చిలుమూరు కోటి, బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, కొండల్, వలీ, మిర్యాల రమేశ్, కొత్తపేట నర్సింహారావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, పిన్ని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

