కారేపల్లి, జూలై 23 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారికి పెను ప్రమాదం తప్పింది. విధి నిర్వహణలో భాగంగా సింగరేణి మండల పరిధిలోని రేలకాయలపల్లికి బుధవారం ఉదయం తన సొంత కారులో వెళ్తున్నాడు. చర్లపల్లి – గాదెపాడు మార్గమధ్యలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి క్రింద నుండి వెళ్తుండగా తాను ప్రయాణిస్తున్న కారు నీళ్లలో మునిగింది. దీంతో ఇంజిన్ ఆగిపోవడంతో కారు నీళ్లలో తేలియాడింది. వెంటనే స్థానికుల సహాయంతో వ్యవసాయ శాఖ అధికారిని రక్షించి కారును నీటిలో నుండి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో షాక్‌కు గురైన ఏఓ అశోక్‌ను తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి తీసుకువెళ్లారు. స్థానికులు సకాలంలో స్పందించడంతో వ్యవసాయ శాఖ అధికారికి ప్రాణాపాయం తప్పింది.
Karepalli : రైల్వే అండర్ బ్రిడ్జి నీళ్లలో మునిగిన కారు.. వ్యవసాయ శాఖ అధికారికి తప్పిన ప్రమాదం