జూలూరుపాడు మార్చి 8 : భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రానికి సమీపంలోని పంట పొలాల్లో శనివారం అంతర్జాతీయ మహళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కేక్ కట్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులు వేల్పుల నరసింహారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ సృష్టికి మూలం, ఈ జీవనానికి మూలం, అర్థం చేసుకునే ఓర్పు, అంతులేని సహనం సాధించగలిగే మనోబలం, గుండెల్లో దాచుకునే ఔదార్యం మహిళ గొప్పతనం అని కొనియాడారు, ఈ కార్యక్రమంలో మహిళలు అనగంటి లక్ష్మి, మంజుల, కడియాల ఉమాదేవి, సునీత, భవానీ, ఝాన్సీ, సావిత్రి, రాధా ప్రియాంక, రమ, యశోద, వరలక్ష్మి, సరిత, లక్ష్మి, నర్వనేని పుల్లారావు, మాచినేని సత్యం, మిర్యాల కిరణ్ కుమార్, మందా దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.