కారేపల్లి, ఫిబ్రవరి 09 : విద్యుదాఘాతంతో సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రానికి చెందిన కేబుల్ ఆపరేటర్ మృతి చెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం ఇల్లెందులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి రజక బజారుకు చెందిన జూపల్లి లాలయ్య (41) ఇల్లెందు మండలంలో కేబుల్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. ఇల్లెందు కరెంట్ ఆఫీస్ సమీపంలో ఖమ్మం ప్రధాన రహదారి పక్కన డిష్ కేబుల్ విద్యుత్ స్తంభాల పైనుండి లాగే క్రమంలో కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. లాలయ్యకు భార్య, నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఇల్లెందు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.